![Rajasthan bjp leader Kirodi resigned his ministry post for poll promises](/styles/webp/s3/article_images/2024/07/4/lal.jpg.webp?itok=TxUmvCmK)
జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర మంత్రి కిరోడి లాల్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనకు అప్పగించిన పలు స్థానాల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు పంపించారు.
‘‘ కిరోడి లాల్ మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు. పది రోజుల క్రితం సీఎంకు రాజీనామా లేఖను అందజేశారు’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ ఎన్నికల్లో కిరోడి లాల్ మీనాకు బీజేపీ ఏడు స్థానాలను అప్పగించింది. ఈ స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. తన సొంత నియోజకవర్గం దౌసాలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలకు 14 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 ఎనిమిది సీట్లు విజయం సాధించింది. మిగతా పార్టీలు మూడు సీట్లను గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment