లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు (ఆదివారం) బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రిచ్‌పాల్ మిర్ధా, విజయపాల్ మిర్ధా, ఖిలాడీ బైర్వా, స్వతంత్ర మాజీ ఎమ్మెల్యే అలోక్ బెనివాల్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సేవాదళ్ సురేష్ చౌదరి, రాంపాల్ శర్మ, రిజుజున్‌వాలా తదితర నేతలు కూడా రాష్ట్రంలో అధికార పార్టీలో చేరారు. వీరందరికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌లు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు.
గతంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా మంత్రులుగా ఉన్నారు. రిచ్‌పాల్ మిర్ధా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపీ జ్యోతి మిర్ధా మామ.
ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అభ్యర్థులు వెల్లడించారు. దేశం కోసం మోదీ కస్టపడి పని చేస్తున్న తీరు వారికి బాగా నచ్చిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ ప్రధాని నాయకత్వంలో మంచి పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment