సాక్షి, న్యూఢిల్లీ: సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు ఇవ్వొద్దంటూ త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనునన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. అధికారుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను వారి సొంత జిల్లాల్లో కొనసాగించరాదని, పోస్టింగులు ఇవ్వకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను సైతం కొనసాగించవద్దని ఆదేశాలిచ్చింది. వచ్చే ఆరు నెలల్లో పదవీ విరమణ పొందే అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం లేదని, వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉండే అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను జూలై 31లోగా తమకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ ఎంపీ.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’
Comments
Please login to add a commentAdd a comment