Employees Transfer process
-
ఎన్నికల ఎఫెక్ట్: సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్’..
సాక్షి, న్యూఢిల్లీ: సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు ఇవ్వొద్దంటూ త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనునన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. అధికారుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను వారి సొంత జిల్లాల్లో కొనసాగించరాదని, పోస్టింగులు ఇవ్వకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను సైతం కొనసాగించవద్దని ఆదేశాలిచ్చింది. వచ్చే ఆరు నెలల్లో పదవీ విరమణ పొందే అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం లేదని, వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉండే అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను జూలై 31లోగా తమకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ ఎంపీ.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’ -
జూన్ 1 నుండి ఉద్యోగుల బదిలీలు
-
ముందుకా? మళ్లీ మొదటికా..?
ముంపు ఉద్యోగుల వివరాలు సేకరణ కలెక్టర్ ఆదేశాలతో మొదలైన బదిలీ ప్రక్రియ భద్రాచలం: ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు మరో ముందడుగు పడింది. బదిలీల ప్రక్రియలో భాగంగా 7 మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎంతమంది తెలంగాణ స్థానికులు ఉన్నారనే దానిపై వివరాల సేకరణ కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆర్సీ నంబర్ ఏ1/1992/2014 పేరుతో ఈ నెల 21న ఉత్తర్వులను జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కలసిన భద్రాచలం డివిజన్లోని చింతూరు, వీఆర్పురం, కూనవరం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), పశ్చిమగోదావరి జిల్లాలో కలసిన పాల్వం చ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గం పాడు మండలాల్లోని 6 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉద్యోగుల వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల స్థానికతను తెలుసుకునేందుకు ప్రత్యేక నమూనా కూడా ఉత్తర్వులతో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారులకు పంపించారు. ఏ రాష్ట్రంలో పనిచేస్తారో తెలిపే అవకాశాన్ని (ఆప్షన్) కూడా ఉద్యోగులకు కల్పించారు. తెలంగాణ స్థానికత ఉన్న వారంతా త్వరలోనే రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. తాజా ఉత్తర్వులతో బదిలీల ప్రక్రియకు మరో ముంద డుగు పడిందని ముంపు ఉద్యోగులు భావిస్తున్నా.. ఇది ఎప్పట్లోగా పూర్తవుతుందనే దానిపై ఎక్కడా స్పష్టత లేదు. కాగా ఏపీలో విలీనమైన 7 మండలాల్లో ఐకేపీ ఉద్యోగుల బదిలీలు సోమవారం పూర్తి చేశారు. 75 మంది ఉద్యోగులకు 35 మంది ఆంధ్రలోనే ఉండిపోగా, 45 మందిని తెలంగాణకు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.