ముందుకా? మళ్లీ మొదటికా..? | IKP transfers employees | Sakshi
Sakshi News home page

ముందుకా? మళ్లీ మొదటికా..?

Published Tue, Feb 24 2015 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

IKP transfers employees

ముంపు ఉద్యోగుల వివరాలు సేకరణ కలెక్టర్ ఆదేశాలతో మొదలైన బదిలీ ప్రక్రియ
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు మరో ముందడుగు పడింది. బదిలీల ప్రక్రియలో భాగంగా 7 మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎంతమంది తెలంగాణ స్థానికులు ఉన్నారనే దానిపై వివరాల సేకరణ కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆర్‌సీ నంబర్ ఏ1/1992/2014 పేరుతో ఈ నెల 21న ఉత్తర్వులను జారీచేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో కలసిన భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), పశ్చిమగోదావరి జిల్లాలో కలసిన పాల్వం చ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గం పాడు మండలాల్లోని 6 రెవెన్యూ గ్రామాల పరిధిలో  ఉద్యోగుల వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల స్థానికతను తెలుసుకునేందుకు ప్రత్యేక నమూనా కూడా ఉత్తర్వులతో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారులకు పంపించారు. ఏ రాష్ట్రంలో పనిచేస్తారో తెలిపే అవకాశాన్ని (ఆప్షన్) కూడా ఉద్యోగులకు కల్పించారు.

తెలంగాణ స్థానికత ఉన్న వారంతా త్వరలోనే రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.  తాజా ఉత్తర్వులతో బదిలీల ప్రక్రియకు మరో ముంద డుగు పడిందని ముంపు ఉద్యోగులు భావిస్తున్నా.. ఇది ఎప్పట్లోగా పూర్తవుతుందనే దానిపై ఎక్కడా స్పష్టత లేదు. కాగా ఏపీలో విలీనమైన 7 మండలాల్లో ఐకేపీ ఉద్యోగుల బదిలీలు సోమవారం పూర్తి చేశారు.  75 మంది ఉద్యోగులకు 35 మంది ఆంధ్రలోనే ఉండిపోగా, 45 మందిని తెలంగాణకు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement