సాక్షి, హైదరాబాద్: జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో ఆవిర్భవించనున్న రాజకీయ పార్టీకి అనుబంధంగా వృత్తి సంఘా లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి కుల సంఘాలు కాకుండా వృత్తుల పేరుతోనే అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని జేఏసీ నేతలు భావిస్తున్నారు. వృత్తి సంఘాల ఏర్పాటుపై జేఏసీ నేతలు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కులాల పేరిట సంఘాలతో కన్నా వృత్తి సంఘాలు ఏర్పాటు చేయ డం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేయ డం కన్నా వృత్తుల పేరిట సంఘాల నిర్మాణం చేసి, వృత్తులవారీగా సమస్యలను గుర్తించడం వల్ల నిర్దిష్టమైన సమాచారం క్రోడీకరిం చడం వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. బీసీ సెల్ పరిధిలో కల్లుగీత, గొర్రెల పెంపకం, కమ్మరి, కుమ్మరి, చేనేత వంటి వృత్తులు ఉంటాయి. బీసీ సెల్ మాత్రమే ఉంటే అన్ని వృత్తుల సమస్యలపై పోరాటం చేయడం సాధ్యం కావట్లేదంటూ భావిస్తున్నారు.
తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికుల వంటివాటి కొత్త వృత్తుల సమస్యలపై ఇప్పటిదాకా నిర్దిష్టమైన చర్చ, డిమాండ్లు, పోరాటాలు జరగలేదంటున్నారు. వృత్తులవారీగా పరిస్థితులపై అధ్యయనం చేయాలని, సమస్యలను గుర్తించి, పోరాటాలు చేయాలని వారి యోచన. వృత్తుల వారీగా పోరాటాలతో దాదాపుగా అన్ని కులాలు, వర్గాలకు జేఏసీ దగ్గరయ్యే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment