Caved employees
-
ముందుకా? మళ్లీ మొదటికా..?
ముంపు ఉద్యోగుల వివరాలు సేకరణ కలెక్టర్ ఆదేశాలతో మొదలైన బదిలీ ప్రక్రియ భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు మరో ముందడుగు పడింది. బదిలీల ప్రక్రియలో భాగంగా 7 మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎంతమంది తెలంగాణ స్థానికులు ఉన్నారనే దానిపై వివరాల సేకరణ కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆర్సీ నంబర్ ఏ1/1992/2014 పేరుతో ఈ నెల 21న ఉత్తర్వులను జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కలసిన భద్రాచలం డివిజన్లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), పశ్చిమగోదావరి జిల్లాలో కలసిన పాల్వం చ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గం పాడు మండలాల్లోని 6 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉద్యోగుల వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల స్థానికతను తెలుసుకునేందుకు ప్రత్యేక నమూనా కూడా ఉత్తర్వులతో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారులకు పంపించారు. ఏ రాష్ట్రంలో పనిచేస్తారో తెలిపే అవకాశాన్ని (ఆప్షన్) కూడా ఉద్యోగులకు కల్పించారు. తెలంగాణ స్థానికత ఉన్న వారంతా త్వరలోనే రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. తాజా ఉత్తర్వులతో బదిలీల ప్రక్రియకు మరో ముంద డుగు పడిందని ముంపు ఉద్యోగులు భావిస్తున్నా.. ఇది ఎప్పట్లోగా పూర్తవుతుందనే దానిపై ఎక్కడా స్పష్టత లేదు. కాగా ఏపీలో విలీనమైన 7 మండలాల్లో ఐకేపీ ఉద్యోగుల బదిలీలు సోమవారం పూర్తి చేశారు. 75 మంది ఉద్యోగులకు 35 మంది ఆంధ్రలోనే ఉండిపోగా, 45 మందిని తెలంగాణకు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. -
ముంపు ఉద్యోగులకు.. ఆంధ్ర నుంచే వేతనాలు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు ముంపు మండలాల్లో పరిపాలన వేగవంతంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే, ముంపు ఉద్యోగులకు వేతనాలను చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, నెల్లిపాక మండలాల అధికారులకు తూర్పుగోదావరి కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏడు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకుగాను వారి సమగ్ర వివరాలను పంపించాలని పేర్కొన్నారు. 20వ తేదీన కలెక్టరేట్ నుంచి జారీ అరుున ఈ ఉత్తర్వుల్లో.. వివరాలను 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాలని పేర్కొనడం గమనార్హం. ఇది, ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ లెక్కన నవంబర్ వేతనాలను కూడా ఏపీ నుంచే వచ్చే అవకాశముందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగుల వివరాలకు సంబంధించి పది అంశాలను పొందుపరిచారు. విలీన మండలాల్లోని ఉద్యోగులంతా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం నుంచే వేతనాలు పొందారు. ఉద్యోగుల పంపకాలు జరిగితే 80 శాతం వరకు ఉద్యోగులు వెనుక్కి (తెలంగాణకు) వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లోని ఉద్యోగుల నుంచి ఖమ్మం కలెక్టర్ ఇటీవల ఆప్షన్లు తీసుకున్నారు. 1585 మంది తెలంగాణలో, 588 మంది ఆంధ్రాలో ఉంటామని చెప్పారు. తాజాగా, ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చిన వారు మాత్రం అక్కడి వేతనాలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకసారి వేతనాలు తీసుకుంటే సర్వీసుపరంగా అనేక ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ఏపీలో వేతనాలు తీసుకుంటామని అంగీకరించిన ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంటు వదులుకోవాల్సిందే. ఈ తాము కోరుకున్న రాష్ట్రానికి బదిలీ చేసప్తే ఎలాంటి గందరగోళం ఉండదని ఏడు మండలాల్లోని ఉద్యోగులు అంటున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తూగో కలెక్టర్ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు డీడీవో వివరాలు, ఏరియా, డీడీవో పేరు.. అడ్రస్. కొత్తగా డీడీవో కోడ్ కేటాయించే క్రమంలో కలెక్టర్ ధృవీకరణ కోసం తగిన వివరాలు. డీడీవోల పరిధిలోని ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్, శాంక్షన్ పోస్టులు, వర్కింగ్, ఖాళీల వివరాలు. ఇందులో గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, క్లాస్ ఫోర్, సీపీఎస్ హోల్డర్ వివరాలు. ఉద్యోగుల వేతన వివరాలు. ఉద్యోగుల ఐడీ, గ్రాస్, డిడక్షన్, నెట్, జీపీఎఫ్ అకౌంట్ నంబర్, ఏపీజీఎల్‌ఐసీ నంబర్, సీపీఎస్ అంకౌంట్ నంబర్, రుణ సదుపాయాలు పొందినట్టరుుతే వాటి వివరాలు. ఉద్యోగులు ఏ బ్యాంకు నుంచి వేతనాలు పొందుతున్నారు? బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్. డీడీవోలంతా తమ కరెంట్ అకౌంట్‌ను రంపచోడవరంలోని ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకోవాలి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డీడీవోవారీగా ఇవ్వాల్సుంటుంది. ఏపీలో విలీనమైన మండలాల్లో పనిచేస్తూ ఆంధ్ర నుంచి వేతనాలను తీసుకొనేందుకు ఇష్టపడని వారి ఉద్యోగుల వివరాలను డీడీవో ధృవీకరించి పంపాలి. వేతనాల బిల్లులను హెచ్ఆర్ఎమ్ఎస్ విధానంలోనే ఇవ్వాలి. అన్ని రకాల చెల్లింపులు ఈ-పేమెంట్స్ ద్వారానే జరగాలి. -
‘ముంపు’ ఉద్యోగులకు జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలి
ఖమ్మం జెడ్పీ సెంటర్: ముంపు మండలాల్లోని ఉద్యోగులకు ఈ జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ పంచాయతీరాజ్(టీ-పీఆర్) ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జనగాం నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం రాష్ర్ట కార్యవర్గ సమావేశం శుక్రవారం నగరంలోని సంఘం కార్యాలయంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఈ జిల్లో ఉద్యోగులకు తెలంగాణ వచ్చిన ఆనందం మిగల్లేదని, ఆందోళన ఎక్కువైందని అన్నారు. వారు పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఇక్కడి ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. ముంపు మండలాల్లోని 34 మంది ఉద్యోగులకు ఈ జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలుచేయాలని, ప్రతి మండలంలో ఈజీఎస్ కింద సీనియర్ అసిస్టెంట్ పోస్టు, ఎన్నికల నిర్వహణకు ఒక పోస్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసరా పథకంపై మండల పరిషత్ ఉద్యోగులందరికీ శిక్షణ ఇస్తే అమలులో పారదర్శకత ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగోన్నతులకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు పంచాయతీరాజ్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఫారెన్ సర్వీస్సుల్లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు ెహ ల్త్ కార్డుల జారీలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ఈ సమావేశం తీర్మానించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎన్.దర్శన్, అసోసియేట్ అధ్యక్షులు జి.శ్రీనివాస్‌రావు, సాధుల ప్రసాద్, సంయుక్త కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి రాంకృష్ణారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు జి.అనిల్‌కుమార్, షరీఫ్, యాదగిరి, ఎంజేఆర్.బాబు, చంద్రమౌళి, శ్రీహరి, మల్లెల రవీంద్రప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, నాయకులు గౌసుద్దీన్, మీరా, రాజేష్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణకే మొగ్గు
భద్రాచలం : ముంపు మండలాల్లో ఉద్యోగుల పంపకాలకు సంబంధించిన నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 31 నాటికి ముంపు మండలాల్లోని ఉద్యోగులు ఎవరు ఏ రాష్ట్రంలో ఉంటారనేది తేలిపోనుంది. ఇందుకోసం ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగుల పంపకాలకు సంబంధించిన లెక్కలు వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. ముంపు మండలాల్లో ఉన్న ప్రత్యేక వెసులుబాటు దృష్ట్యా అక్కడ పనిచేస్తున్న వారు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేసేలా ఆప్షన్ సౌకర్యం కల్పించే క్రమంలోనే ఉద్యోగుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. ముంపులో పనిచేసే ఉద్యోగుల సెప్టెంబర్ నెల వేతనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ముంపులో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులంతా తిరిగి వెనక్కు పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బుధవారం ముంపు మండల విద్యాశాఖాధికారులతో డీఈవో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యోగుల జాబితాలపై సమీక్షించారు. అలాగే ఇప్పటికే అన్ని శాఖల నుంచి ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా, వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే దానిపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరారు. కాగా ముంపులో పనిచేస్తున్న దాదాపు అన్ని శాఖల్లో ఎక్కువ మంది ఉద్యోగులు తెలంగాణకే వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. వైద్యశాఖలో తెలంగాణకు 263, ఆంధ్రకు 54 మంది ఆప్షన్... వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ముంపు మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సీహెచ్ఎన్సీలలో అన్ని కేడర్లకు సంబంధించి మొత్తం 317 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇందులో 263 మంది తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేసేందుకు అంగీకారం తెలిపారు. కాగా 54 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు అంగీకరించారు. చింతూరు మండలంలో అప్షన్ల వివరాలు... విద్యా శాఖలో మొత్తం ఉపాధ్యాయులు 121 మంది కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 56 మంది, తెలంగాణకు 65 మంది అప్షన్లు ఇచ్చారు. రెవెన్యూ శాఖలో మొత్తం ఉద్యోగులు 21 మంది కాగా, 16 మంది తెలంగాణలో, ఐదుగురు ఏపీలో పనిచేసేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖలో 43 మందికి ఏపీలో 9 మంది, తెలంగాణలో 34 మంది పనిచేసేందుకు అప్షన్లు ఇచ్చారు. అటవీశాఖలో 63 మందికి 22 మంది ఆంధ్రకు, 33 మంది తెలంగాణకు వచ్చేందుకు అంగీకరించారు. డీఈటీ విభాగంలో 8 మందికి ఏపీకి ఇద్దరు, తెలంగాణకు ఆరుగురు ఆప్షన్ ఇచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో 8 మంది ఉద్యోగులకు గాను ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఐదుగురు వచ్చేందుకు అంగీకరించారు. పంచాయతీరాజ్ శాఖ విభాగంలో ఉన్న ఆరుగురు కూడా తెలంగాణలోనే ఉండేందుకు అప్షన్ ఇచ్చారు.