సర్కారుపై ఒత్తిడి తెద్దాం:దేవీ ప్రసాద్ | will do attack on govt says devi prasad | Sakshi
Sakshi News home page

సర్కారుపై ఒత్తిడి తెద్దాం:దేవీ ప్రసాద్

Published Sun, Jul 24 2016 11:18 PM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

will do attack on govt says devi prasad

సాక్షి, ఖైరతాబాద్‌: తెలంగాణలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందని టీఎన్‌జీఓ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్‌ మాట్లాడుతూ హెల్త్‌ కార్డులు వెంటనే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సెప్టెంబర్‌–2న జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించే సమ్మెకు ఉద్యోగ సంఘాలన్నీ మద్దతు ఇవ్వాలన్నారు.  కార్యక్రమంలో టీఎన్‌జీఓ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, తెలంగాణ డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షులు హరినాద్‌బాబు, రాష్ట్ర అధ్యక్షులు హబీబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement