జైపూర్ : ‘తల్లి మీరిక్కడే ఆడుకోండి. నేను బజారుకెళ్లి వస్తానంటూ ఓ తాత తన మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు. కానీ ఆ చూపే తన మనువరాలిని చూసే చివరి చూపవుతుందనుకోలేదు.’ ఇంతకి ఏం జరిగిందంటే..
రాజస్థాన్(rajastan)లోని అల్వార్ జిల్లాలో ఇక్రానా తన తాత, ఐదుగురు స్నేహితులతో కలిసి పొలానికి వెళ్లింది. పొలం పనిచేసిన అంనతరం తాత స్థానికంగా ఉండే మార్కెట్‌కు వెళ్లాడు. వెళ్లే సమయంలో మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు.
తాత మాట విన్న ఆ మనువరాలు తన స్నేహితులతో పొలంలోనే ఆడుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరింది. మార్గం మధ్యంలో 7-8 వీధి కుక్కలు (street dogs) ఇక్రానా,ఆమె స్నేహితులపై దాడి చేశాయి. కుక్కుల దాడితో భయాందోళనకు గురైన చిన్నారులు బిగ్గరుగా కేకలు వేశారు. చిన్నారుల కేకల విన్న పక్కనే పొలం పనులు చేస్తున్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లల్ని కుక్కల దాడి నుంచి కాపాడారు. అత్యవసర చికిత్స నిమిత్తం ట్రాక్టర్‌లో తరలించారు.
అయితే, ఆ వీధి కుక్కల్లోని ఓ కుక్క మాత్రం ఇక్రానాను వదిలి పెట్టలేదు. వెంటపడి మరీ కరిచింది. ట్రాక్టర్‌లో తరలిస్తున్నా ఇంకా కరించేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకే కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారుల్ని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ దుర్ఘటనలో ఇక్రానా మరణించింది. ఇక్రానాపై దాడి చేసిన కుక్క గతంలో ఇతర జంతువులపై దాడి చేసిందని, అందువల్లే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment