
పొడవాటి మధుపాత్ర
ఎంతటి ‘పీపా’త్ములు ‘సీసా’పద్యాలాపన లంకించుకున్నా, వాళ్ల చేతుల్లోని మధుపాత్రలు సాధారణంగా అరచేతిలో సునాయాసంగా
తిక్క లెక్క
ఎంతటి ‘పీపా’త్ములు ‘సీసా’పద్యాలాపన లంకించుకున్నా, వాళ్ల చేతుల్లోని మధుపాత్రలు సాధారణంగా అరచేతిలో సునాయాసంగా ఇమిడిపోయేటట్లే ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న మధుపాత్ర మాత్రం... తాగడానికి కాదు, మధువు మడుగులో దూకడానికన్నట్లు రూపొందించినట్లుగా లేదూ! నయాగరా ఐస్‌వైన్ ఫెస్టివల్ సందర్భంగా నయాగరా జలపాతం వద్ద 2011లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు.
ఓంటారియో వైన్‌క్లబ్ సభ్యులందరూ ఇందులో శక్తివంచన లేకుండా సీసాలకు సీసాల మధువు పోసి చూస్తే, ఇందులో ఏకంగా 27 లీటర్ల మధువు పట్టింది. ఆ తర్వాత ఏమైందంటారా..? గిన్నెస్ రికార్డు బద్దలైంది.