సీసాల్లో కళాకృతులను రూపొందించిన బసవరాజు
శివాజీనగర (బెంగళూరు): సీసాలో కళాకృతులు రూపొందించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనికి ఎంతో ఓర్పు, నేర్పు అవసరం ఇలా సీసాల్లో కళాకృతులను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ప్రముఖ కళాకారుడు బసవరాజు ఎం.గౌడ పెద్ద నోట్ల రద్దుపై ఒక కళాకృతిని రూపొందించాడు. నోట్ల రద్దుకు బుధవారం నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ‘నేడు పాత నోట్ల వర్ధంతి, కొత్త నోట్ల జయంతి’ అంటూ సీసాల్లో ఆ నోట్ల నమూనాల ఫోటోఫ్రేమ్‌లను తీర్చిదిద్దాడు.
మంగళవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో వాటిని ప్రదర్శించాడు. ఇందుకు అవసరమైన ఒక్కో వస్తువును బాటిల్‌లోకి పంపి ఆ తరువాత కళాకృతిని సిద్ధం చేసినట్లు ఆర్టిస్ట్ బసవరాజు తెలిపారు. ఆయన గతంలో కూడా ప్రముఖ సందర్భాలను పురస్కరించుకుని బాటిల్ కళాకృతులను రూపొందించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం తదితరులతో ప్రశంసలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment