బాటిల్ నీరే దిక్కు..
బాటిల్ నీరే దిక్కు..
Published Wed, Aug 10 2016 8:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ప్రభుత్వ పాఠశాలను ‘కార్పొరేట్’కు ధీటుగా మారుస్తున్నాం.. అన్ని వసతులు కల్పిస్తున్నాం.. నూరు శాతం ఫలితాలే లక్ష్యం.. ఇదీ తరుచూ పాలకులు చెబుతున్నా మాట. కాని పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్న దుస్థితి.
తేలప్రోలు(ఉంగుటూరు) :
స్థానిక జెడ్పీ పాఠశాలలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదులు అరకొరగానే ఉన్నాయి. తాగునీటి వసతి అంతంతమాత్రంగానే ఉంది. పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన కుళాయిలు పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసి ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు చెరువు దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనానికి..
పాఠశాలలో 210 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. భోజనం తయారు చేసేందుకు వంట ఏజెన్సీ నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు.
ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాల్సిందే..
మధ్యాహ్న భోజనం సమయంతో బాటిల్‌తో ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. అయితే ప్లేట్లు శుభ్రం చేసుకునేందుకు సమీపంలోని చెరువుకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.
తాగునీటి ప్లాంట్ మూత..
విద్యార్థుల అవసరాల దృష్ట్యా వల్లభనేని రమేష్‌చంద్, అరుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సురక్షత మంచినీటి సరఫరా ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. డిసెంబరు, 23, 2015 ప్రారంభించారు. మూడు రోజుల మాత్రమే పని చేసింది. మోటారు రిపేరు కావడంతో అప్పటి నుంచి పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు.
రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం : ప్రసాద్, హెచ్‌ఎం
దాతలు సాయం ఏర్పాటు మెటీరియల్‌ను కొందరు ధ్వంసం చేస్తున్నారు. తాగునీటి సమస్య ఉంది. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తా.
Advertisement