pinchans
-
ఎనిమిది వేల ఇళ్లు మంజూరు చేయిస్తా
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గానికి త్వరలో ఎనిమిది వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ప్రకటించారు. శనివారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో ఆసరా పింఛన్ లబ్దిదారులకు పెరిగిన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొనగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నియోజకవర్గానికి ఎనిమిది వేల డబుల్ బెడ్రూంలను మంజూరు చేయించి నియోజకవర్గంలోని పేదలందరికీ గూడు కల్పిస్తానని చెప్పారు. కాగా రాబోయె రెండేళ్లలో కాళేశ్వరం నీళ్లు నియోజకవర్గానికి రానున్నాయని, సీఎంతో మాట్లాడి కాళేశ్వరం నీళ్లు ఎక్కువ వచ్చేలా చేస్తానని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు వస్తే కరువు ఉండదని నీటి సమస్య కూడా ఉండదన్నారు. కాగా గ్రామాలు, పురపాలక సంఘాలను మరింత అభివృద్ధి చేసే దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ మురికి కాలువలు నిర్మిచేందుకు సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఎవరికి వారు తమ బాధ్యతలను నెరవేర్చాలని మదన్‌రెడ్డి సూచించారు. పార్టీలకు అతీతంగా సమష్టిగా ముందుకు సాగితేనే గ్రామాలు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. కాగా గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పింఛన్ సొమ్మును పెంచారని తెలిపారు. త్వరలో సీఎం జిల్లాలో పర్యటించి సమీక్ష జరిపి అక్కడే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని మదన్‌రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో నీటి కొరత తలెత్తగా సర్పంచ్‌లు, అధికారులు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. -
ప్రాణం పోయినా మాట తప్పను
వనపర్తి టౌన్: పట్టణంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రాణం పోయినా పేదలకు ఇచ్చే మాట తప్పనని, రెండు రోజులు అటో..ఇటో జరగచ్చు కానీ, ఇచ్చిన మాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పను అని పేర్కొన్నారు. పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు శనివారం జిల్లాకేంద్రంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ, కౌన్సిలర్ల జోక్యం ఉండదని, పూర్తి పారదర్శకతతో అధికారులే చేపట్టేలా చూస్తానన్నారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కేసీఆర్ గెలిచినా పింఛన్ పెంచడం లేదని పలువురు అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. పొడిచే పొద్దు మారినా.. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పబోరని, ఎన్నికల కోడ్ నిబంధనల కారణంగా పింఛన్ల పెంపులో జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కుట్రలను భగ్నం చేసి విలువైన ఆస్తులను కాపాడి ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కబ్జాలను నిర్మూలించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని కొనియాడారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించనుందన్నారు. కొత్త పురపాలక చట్టం ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధుల్లో బాధ్యత పెంచిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతామహంతి, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, గొర్రెల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, పుర మాజీ చైర్మన్, అధికారులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి పేరు నిలబెట్టాలి వనపర్తి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డిపో లీజుకు ఇచ్చిన పెట్రోల్ బంక్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ మేరకు రిబ్బన్ కట్ చేసిన ఆయన మాట్లాడుతూ డిపోను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు వ్యాపార సముదాయ దుకాణాల ఏర్పాటుకు అనుగుణంగా రూపొందించాలని డీఎం దేవదానంకు సూచించారు. కార్యక్రమంలో కల్వరాజు, జ్యోతిబాబు, డిపో అధికారులు దేవేందర్‌గౌడ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్లు రికవరీ చేసి పంపండి
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ముకరంపుర: జిల్లాలో ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సబ్యుల్లో పింఛన్ పొందుతున్న 2932 మంది ఆసరా లబ్ధిదారుల నుంచి సొమ్ము రికవరీ చేసి ప్రభుత్వానికి పంపించాలని డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 2932 మంది ఆసరా పింఛన్‌దారుల్లో 1259 మందికి వృద్ధాప్య, వితంతు 692, వికలాంగులు 330, గీత కార్మికులు 36, చేనేత 57, బీడీ కార్మికుల పింఛన్లు 558 మందిని గుర్తించి ఆసరా వెబ్సైట్ నుంచి తొలగించినట్లు వివరించారు. సంబంధిత ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు నోటీసులు జారీచేసి వారి నుంచి ఇప్పటివరకు చెల్లించిన పింఛన్ల మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. ఆ మొత్తాన్ని చెక్కు, డీడీ, బ్యాంకు ఓచర్ ద్వారా వసూలు చేసి రాష్ట్ర నోడల్ అకౌంట్,హైదరాబాద్‌కు జమచేయాలని ఆదేశించారు. -
అనర్హుల ఆసరా.. రికవరీ
జిల్లాలో అర్హతలేకుండా పింఛన్లు తీసుకుంటున్నది.. 2,333 మంది వారి నుంచి రూ.2.81 కోట్ల వసూలుకు ఆదేశాలు తొలుత సర్కారు ఉద్యోగుల సంబంధీకులకు చెక్ బుధవారంలోగా నోటీసులు.. 11తేదీలోగా రికవరీ ఆసరాలో అనర్హులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు స్వీకరించిన సొమ్మును రికవరీ చేసేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తొలుత వారికి నోటీసులు జారీ చేసి, పక్షం రోజుల్లో డబ్బును రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్(ఎస్ఈఆర్పీ) ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో అనర్హులకు నోటీసుల జారీకి మండల యంత్రాంగం చర్యలు చేపట్టింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా జిల్లాలో 2,93,732 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత కార్మికులున్నారు. పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు పెట్టింది. ఈ మేరకు ఎంపిక చేయాలని సూచించగా.. క్షేత్రస్థాయిలో తప్పుడు వివరాలు సమర్పించి కొందరు అర్హులుగా జాబితాలోకి ఎక్కారు. ఈ క్రమంలో వారంతా పింఛన్లు పొందుతున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులను ఏరివేసేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేపట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఆధారపడ్డవారు కూడా పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం.. వారిని జాబితా నుంచి తొలగించడమే కాకుండా ఇప్పటివరకు తీసుకున్న సొమ్మును రికవరీ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇలా జిల్లాలో 2,333 మంది ఉన్నట్లు తేల్చిన యంత్రాంగం.. వారి నుంచి రూ.2,81,13,200 రికవరీ చేసి సెర్ప్ ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. అనర్హులుగా గుర్తించిన వారికి ఈనెల రెండోతేదీలోగా నోటీసులిచ్చిన అనంతరం ఈనెల 11లోగా రికవరీ చేయాలని తేల్చిచెప్పింది. ఇలా దొరికిపోయారు.. ఆసరా పథకం కింద పింఛన్లు తీసుకుంటున్న వారి ఆధార్ వివరాలను ప్రభుత్వం ఇదివరకే ఆన్లైన్లో నమోదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకంలోనూ వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసింది. ఈక్రమంలో ఆసరా పథకంలోని లబ్ధిదారుల ఆధార్ వివరాలను, హెల్త్ కార్డుల డాటాబేస్‌లోని ఆధార్ వివరాలను సరిపోల్చగా 2333 మందికి సంబంధించి వివరాలు సరిపోలాయి. దీంతో ఆ మేరకు వారిని ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడిన వారిగా నిర్ధారిస్తూ.. వారి పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగించారు. తాజాగా రికవరీకి ఉపక్రమించారు. ఉద్యోగుల జీతాల్లోంచైనా.. జాబితాలో అనర్హులుగా గుర్తించిన వారికి సంబంధించి రికవరీ ప్రక్రియను ప్రభుత్వం కఠినతరం చేసింది. ముందుగా అనర్హులుగా గుర్తించినవారికి నోటీసులు జారీ చేసిన అనంతరం.. సొమ్ము రికవరీకి పది రోజుల గడువునిచ్చింది. నిర్దేశిత గడువులోగా డబ్బులు చెల్లించకుంటే వారికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి ఆ మేరకు నిధులు వెనక్కి రాబట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేటగిరీల్లోనూ ఏరివేత ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడి ఉన్న వారిని అనర్హులుగా గుర్తించిన సర్కారు.. త్వరలో అన్ని కేటగిరీల్లోనూ అనర్హులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. ఆసరా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని అర్హతలున్నవారికే లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. నిబంధనలను అతిక్రమించిన వారిని జాబితా నుంచి తొలగించి రికవరీ చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. -
అనర్హులకే పింఛన్ల తొలగింపు: నిమ్మల
అనంతపురం: అనర్హులకు మాత్రమే పింఛన్లు తొలగించామని, అర్హులైన వారికి పింఛన్లు దక్కకపోతే తమ జీతాల నుంచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు.