
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గత 24 గంటల్లో 96,424 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,14,677 కు చేరుకుంది. ఈనెల 16న కరోనా కేసులు 50 లక్షల మార్కు దాటింది. గత 24 గంటల్లో 1,174 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 84,372కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 41,12,551కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 10,17,754గా ఉంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసులు 30 లక్షలకు పైగా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 19.52 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.86 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.62 శాతానికి పడిపోయిందని కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment