మూడ్రోజుల్లో మరో లక్ష | COVID-19: India records highest-ever 45,720 new cases | Sakshi
Sakshi News home page

మూడ్రోజుల్లో మరో లక్ష

Published Fri, Jul 24 2020 5:46 AM | Last Updated on Fri, Jul 24 2020 5:46 AM

COVID-19: India records highest-ever 45,720 new cases  - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 12 లక్షలు దాటాయి. బుధవారం ఏకంగా 45,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒకే రోజులో వచ్చిన అత్యంత ఎక్కువ కేసులు ఇవే కావడం గమనార్హం. ఒకే రోజులో 1,129 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 28,861కి చేరుకుంది. దీంతో మొత్తం కేసులు 12,38,635కు చేరుకున్నాయి. కరోనా కేసులు 11 లక్షలు దాటిన మూడు రోజుల్లోనే 12 లక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ 7,82,606 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకే రోజు ఏకంగా 29,557 మంది కోలుకున్నారని, దీంతో రికవరీ రేటు 63.18కి చేరుకుందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement