ఒక్కరోజే 2,003 మంది మృతి | India registers highest-ever spike of 2003 lifeless | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే 2,003 మంది మృతి

Published Thu, Jun 18 2020 6:50 AM | Last Updated on Thu, Jun 18 2020 6:54 AM

India registers highest-ever spike of 2003 lifeless - Sakshi

ముంబైలో పీపీఈ కిట్‌లు ధరించి వస్తున్న ఆరోగ్య కార్యకర్తలు

న్యూఢిల్లీ: కరోనా పిశాచి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 3.50 లక్షలు, మరణాలు 11 వేల మార్కును దాటేశాయి. దేశంలో ఈ మహమ్మారి వల్ల తాజాగా 2,003 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఇటీవలే సంభవించిన కొన్ని మరణాలకు కరోనా వైరస్‌ కారణమని తేలడంతో వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో బుధవారం మరణాల సంఖ్య 2,003గా నమోదయ్యింది.  మంగళవారం నుంచి బుధవారం వరకు ఒక్కరోజులో ఇండియాలో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 3,54,065కు, మరణాలు 11,903కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్‌ కరోనా కేసులు 1,55,227 కాగా, 1,86,934 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 52.79 శాతంగా నమోదయ్యింది.   కోవిడ్‌ మరణాల్లో ఇండియా ప్రపంచంలో 8వ స్థానానికి చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement