సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 97.23 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో ఇచి్చన 8,36,118 డోసులతో కలిపి మొత్తం డోసుల సంఖ్య 97.23 కోట్ల డోసులను (97,23,77,045) అధిగమించింది. గత 24 గంటల్లో 17,861 మంది రోగులు కోలుకున్న తర్వాత మొత్తం కోలుకున్న రోగుల సంఖ్య 3,33,99,961 కు పెరిగింది.
అదే సమయంలో దేశవ్యాప్త రికవరీ రేటు 98.08 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 15,981 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 8 రోజులుగా దేశంలో 20వేల కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,632కు చేరింది. ఇది 218 రోజుల కనిష్ట స్థాయిగా ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు 24 గంటల్లో మొత్తం 9,23,003 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు
దాదాపు 59 కోట్ల కరోనా టెస్ట్‌లు చేశారు.
అదే సమయంలో వారపు పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉంది. గత 113 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. కాగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment