
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. బుధవారం తాజాగా మరో 78,357 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 37,69,523 కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,026 మంది కోలుకోగా.. 1,045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 6 రోజుల నుంచి దేశంలో రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 29,01,908 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,01,282 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.26 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి ఇది 76.98 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.76 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 1 వరకు 4,43,37,201 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 10,12,367 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గతం వారం రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.