న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య బుధవారానికి 15 లక్షలు దాటింది. 14 లక్షల మార్కును దాటిన కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షలకు చేరుకోవడం గమనార్హం. బుధవారం కొత్తగా 48,513 కొత్త కేసులు వెలుగుచూడగా, 768 మంది మరణించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,88,029కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 15,31,669 మందికి కరోనా సోకగా, ప్రస్తుతం 5,09,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 64.51 శాతానికి చేరుకుంది. గత వారంరోజులుగా ప్రతి రోజూ 45 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 1,77,43,740 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కరోనానుంచి కోలుకున్న వారి సంఖ్య 10 లక్షలకు దగ్గరగా వచ్చిందని, మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment