Sakshi News home page

కోవిడ్‌తో జాగ్రత్త అవసరం: కిషన్‌రెడ్డి 

Published Mon, Dec 25 2023 11:23 AM

Kishan Reddy Key Comments Over Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్‌ కారణంగా దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్యల పెరుగుతోంది. దాదాపు 700లకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. ఇక, తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. 

అయితే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం తిలక్‌నగర్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్లారు. కోవిడ్‌పై ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కోవిడ్‌ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేశాం. అవసరమైతే కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తాం. కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందని, ప్రమాదకరంకాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌ కట్టడికి ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. 

Advertisement
Advertisement