క్రైమ్: విడ్డూరంగా అనిపిస్తుందా?. కరోనా టైంలో చనిపోయాడని అధికారులు ప్రకటించిన ఓ వ్యక్తి.. రెండేళ్ల తర్వాత బతికొచ్చాడు. అది తెలిసి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు షాక్ తిన్నారు.
మధ్యప్రదేశ్ ధార్‌కు చెందిన కమలేష్ అనే వ్యక్తికి.. కరోనా రెండో వేవ్ టైంలో అంటే 2021 లాక్‌డౌన్ సమయంలో కరోనా సోకింది. అయితే వైరస్‌తో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు అధికారులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించలేదు వైద్య సిబ్బంది. దీంతో మున్సిపల్ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు(బుధవారం) కమలేష్ తిరిగి రావడంతో అంతా షాక్ తిన్నారు. తనని అహ్మదాబాద్‌లో ఓ గ్యాంగ్ ఇంతకాలం బంధించి ఉంచిందని, మత్తు మందు ఇస్తూ వచ్చిందని చెప్తున్నాడు కమలేష్. ఎలాగోలా తప్పించుకుని వచ్చానని చెప్పగా.. భార్యతో పాటు తల్లిదండ్రులు అతన్ని కమలేష్‌గా ధృవీకరించారు. ఈ వ్యవహారంపై ధార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment