
ముంబై : చిచోరే, గుడ్ న్యూస వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి అభిలాషా పాటిల్ (40) కన్నుమూశారు. కరోనా కారణంగా ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. షూటింగ్ కోసం వచ్చిన బెనారస్‌కు వెళ్లిన ఆమెకు కరోనా సోకింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అభిలాషా కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమెను వెంటనే ఐసీయూకి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో అభిలాష చనిపోయినట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇక మరాఠీ సీరియల్ ‘బాప్ మనుస్’ తో పాటు పలు సీరియళ్లలో ఆమె నటించింది. అభిలాష మరణంపై నటుడు సంజయ్ కుల్‌కర్ణి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
చదవండి: మా చిన్నమ్మ ఐసీయూలో ఉంది.. వెంటిలేటర్ బెడ్ కావాలి :నటి
Comments
Please login to add a commentAdd a comment