India Reports 12,591 New Covid Cases, Sharp Rise Since Yesterday - Sakshi
Sakshi News home page

Corona Virus: భారత్‌లో భారీగా నమోదైన కోవిడ్‌ మరణాలు.. ఒక్క కేరళలోనే 11 మంది మృతి

Published Thu, Apr 20 2023 11:10 AM | Last Updated on Thu, Apr 20 2023 11:21 AM

India Reports 12591 New Covid Cases Sharp Rise Since Yesterday - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి తన విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేసులతోపాటు మరణాలు పెరుగుతుండటం ప్రజలను భయందోళనకు గురి చేస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 12 వేలు దాటిపోయింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 12,591 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క రోజే 40 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 11 మరణాలు కేరళ నుంచే నమోదవ్వడం గమనార్హం

నిన్నటితో పోలిస్తే 20 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. అంతేగాక గత ఎనిమిది నెలల్లో ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 65,286 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4.48 కోట్ల మంది వైరస్‌ బారిన పడగా.. మొత్తం మరణాల సంఖ్య  5,31,230కు చేరింది. 4,42,61, 476 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 5.32 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.67 శాతం, యాక్టివ్‌ కేసుల శాతం 0.15 గా ఉంది.

కాగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ XBB.1.16 బాధితులే ఎక్కుగా ఉన్నట్లు వైద్య నిపుణలు పేర్కొన్నారు. కేసులు పెరిగినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌, బూస్టర్‌ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement