పల్లె 'వెలుగు' నుంచి చీకట్లోకి | anantapuram road accident: death toll rises to 16 | Sakshi
Sakshi News home page

పల్లె 'వెలుగు' నుంచి చీకట్లోకి

Published Wed, Jan 7 2015 1:08 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

పల్లె 'వెలుగు' నుంచి చీకట్లోకి

పల్లె 'వెలుగు' నుంచి చీకట్లోకి

అనంతపురం :  ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అనేక కుటుంబాల్లో వెలుగులు ఆర్పేసింది.  అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం 16 మంది ప్రాణాలు బలిగొంది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారు  ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు.  మడకశిర డిపోకు చెందిన ఆర్టీసీ  పల్లె వెలుగు బస్సు AP 28 Z 1053 పెనుకొండకు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది.  బస్సు ప్రయాణికుల్లో చాలా మంది విద్యార్థులే.   పెనుకొండలోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న వారే. ఈరోజు ఉదయం 8. ప్రాంతంలో  పెనుకొండకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

మడకశిర, పెనుకొండ మార్గంలో ఉన్నవన్నీ పల్లెటూళ్లే. దీంతో చదువుకునేందుకు  పిల్లలకు సమీప పట్టణమైన పెనుకొండే దిక్కు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నట్టు సమాచారం.  హఠాత్తుగా బస్సులో 60 అడుగుల లోతులోకి పడిపోయవడంతో అంతా షాక్‌ గురయ్యారు.  అంత ఎత్తు నుంచి పడటంతో...  బస్సు పూర్తిగా దెబ్బతింది.  ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమన్న అక్షరాలు తప్ప బస్సంతా నుజ్జు నుజ్జు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement