ముందు అద్దం లేకుండా మున్ముందుకు...!
రవాణా శాఖా మంత్రి గారూ... ఆర్టీసీకి వంద రోజుల లక్ష్యం పెట్టారు ... సమస్యలేమైనా ఉంటే సరిచేయాలని సూచించారు ... డిపో ఆవరణల్లో ఆహ్లాదం .. బస్సుల్లోనేకాదు బస్టాండుల్లో పరిశుభ్రత ... బస్సు కండిషన్ బ్రహ్మాండంగా ఉండాలని ఒకటేమిటి ఎన్నో సూక్తులు చెప్పి ఊరించారు .. ప్రయాణికులే మన దేవుళ్లంటూ హారతి పళ్లెం తిప్పి బస్సు ఛార్జీలు పెంచేసి దక్షిణ లాగేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు ... ఈ జిల్లాలోనే అందులోనూ ఒంగోలులోనే శనివారం వివిధ సమీక్షలతో బిజీబిజీగా ఉన్న మీ పక్క నుంచే చూడండి మీ శాఖను వెక్కిరిస్తూ బస్సు ఎలా దీనంగా వెళ్తుందో. ముందు అద్దం లేకుండానే పరుగులు తీస్తోంది.
ఇదేదో పల్లె వెలుగు బస్సు అనుకుంటే పొరపాటే. కావలి - నెల్లూరు వైపు తిరిగే సూపర్ లగ్జరీ బస్సు. ‘ప్రయివేటీకరణ చేయం’ అంటున్న మీ మాటల్లో అంతరార్థం ఏమిటో లీలగా అర్థమవుతోంది. ఈ తరహా బస్సులు మరిన్ని తిప్పితే ప్రయాణికులే ఆర్టీసీ వద్దు ‘బాబూ’ అంటారనే కదా మీ ఉద్దేశం. ఇటు ఉద్యోగులను, అటు ప్రయాణికులను ఇలా సిద్ధం చేస్తున్నారా శిద్దా గారూ...