పెనుకొండ : మండలంలోని మడకశిర ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిన రెండో పెద్ద ప్రమాదంగా నమోదైంది. 20 12 ఏప్రిల్ 24న స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో హంపీ ఎక్స్‌ప్రెస్ నిలచి ఉన్న గూడ్స్ రై లును ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఆ ఘటనను మరువకముందే ఈ ఘోరం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బస్సు ప్రమాదంల పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, మడకశిర ప్రాంత ప్రజలను శోక సంద్రంలో ముంచింది. 14 ఏళ్ల క్రితం ప్రస్తుతం బస్సు పడిన ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు పడి 10 మంది దాకా మరణించారని స్థానికులు గుర్తు చేసుకున్నారు.
సహాయక చర్యలకు ప్రత్యేక సెల్
పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన వెంట నే 18004256401 నంబర్‌తో సెల్‌ను ప్రారంభిం చారు. దీని ద్వారా క్షతగాత్రులు ఎవరెవరు చికిత్స పొందుతున్నారు.. తదితర వివరాలను బంధువులకు అందిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పతిలో 16 మంది, హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. హిందూపురంలో చికిత్స పొందుతూ బండ్లపల్లికి చెందిన గంగాధర్, హేమావతికి చెందిన శ్రీనివాసులు మృతి చెందారని వివరించారు. ఈ ప్రత్యేక సెల్ మరికొన్ని రోజులు కొనసాగించనున్నట్లు తెలిపారు.
రైలు ప్రమాదం మరువకముందే..
Published Thu, Jan 8 2015 9:35 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement