
ఢిల్లీలో గాలిదుమారం, కొట్టుకుపోయిన వాహనాలు
నిన్నటివరకు ఎండ, ఉక్కబోతతో అల్లాడిన దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా పెను దుమారం వచ్చింది. మొత్తం వీధులన్నీ చీకటి మయమైపోయాయి. భారీ గాలి దుమారం రావడంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. కొంతమంది రోడ్డుమీద వెళ్లేవాళ్లు గాయపడ్డారు. పాదచారులు కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని వెళ్లాల్సి వచ్చింది.
నైరుతి రుతు పవనాల ప్రభావం ఢిల్లీ మీద కూడా పడింది. ఉదయం నుంచే మేఘాలు అలముకున్నాయి. పెద్ద ఎత్తున గాలులు, దుమారం చెలరేగాయి. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిన ఢిల్లీ.. ఇప్పుడు మాత్రం చల్లటి జల్లులతో కూల్ అయింది. అక్కడక్కడ చినుకులు కూడా పడుతున్నాయి.