
కిరణ్ బేడీ కార్యాలయంపై న్యాయవాదుల దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కార్యాలయంపై సోమవారం న్యాయవాదులు దాడి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలోని కృష్ణానగర్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఆ సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో లేరు.
న్యాయవాదులు కిరణ్ బేడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తన కార్యాలయంపై న్యాయవాదులు దాడిచేశారని, కొందరు గాయపడినట్టు సమాచారం అందిందని కిరణ్ బేడీ చెప్పారు.