
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బస్సు బోల్తాపడిన ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. వివరాలు.. ఆగ్రా ఖండౌలి ప్రాంతంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో గురువారం ఉదయం 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment