bus overturns
-
విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని సైదాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 75 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. జౌన్‌పూర్‌లోని కాంతి దేవి జనతా విద్యాలయ పాఠశాల విద్యార్థులను ప్రయాగ్‌రాజ్‌లోని మాన్‌గఢ్‌కు టూర్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ముందున్న ఓ బైక్‌ను తప్పించబోయి డ్రవైర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కూడా కిందపడి గాయాలపాలయ్యారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
విషాదం: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బస్సు బోల్తాపడిన ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. వివరాలు.. ఆగ్రా ఖండౌలి ప్రాంతంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో గురువారం ఉదయం 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది. చదవండి: ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే! -
బస్సు బోల్తా : 30 మంది భక్తులకు గాయాలు
జైపూర్: అజ్మీర్ దర్గాను సందర్శించేందుకు భక్తులతో వెళ్తున్న బస్సు బుధవారం ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సమీపంలోని రెండు ఆసుపత్రుల్లో తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. బిహార్ రాష్ట్రానికి చెందిన వీరంతా ఖాజా మొయినొద్దీన్ చిస్తీలో ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డాడని తెలిపారు. -
పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు
-
పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు
జమ్మలమడుగు : పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో సుమారు 25 మందికి గాయాలు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు సమీపంలోని ఎత్తులేటికట్ట వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పెద్దమొడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి పెళ్లికూతురు తరఫువారు సుమారు 60 మంది బస్సులో పులివెందులకు బయల్దేరారు. ఈ బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఎత్తులేటికట్ట వద్ద బోల్తా పడింది. 25 మందికి గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పెళ్లి కుమార్తెతో ఉన్న బస్సు గంట ముందే బయల్దేరి వెళ్లింది. -
ప్రైవేటు బస్సు బోల్తా
తూర్పుగోదావరి : వేగంగా వెళ్తున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. రవళి స్పిన్నింగ్ మిల్కు చెందిన బస్సు కార్మికులను ఎక్కించుకొని కొత్తపేట నుంచి వానపల్లికి వస్తున్న క్రమంలో వానపల్లి శివారులకు వచ్చేసరికి ముందు వెళ్తున్న స్కూల్ బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. -
ఫ్లైఓవర్‌పై స్కూల్ బస్సు బోల్తా
న్యూఢిల్లీ: ఢిల్లీలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని పలువురు విద్యార్థులు గాయపడ్డారు. తాము ప్రయాణీస్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడటంతో మొత్తం పన్నెండుమందికి గాయాలపాలయ్యారు. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గాయపడిన విద్యార్థులను సమీపంలోని సుశృతా ట్రామా సెంటర్‌కు, అరుణా అసఫ్ అలీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం మొత్తం 30 మంది విద్యార్థులతో బయలుదేరిన రుక్మిణీ దేవీ, విక్టోరియా గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్స్‌కు చెందిన బస్సు ఉదయం 8గంటల ప్రాంతంలో ఐఎస్బీటీ ఫ్లైఓవర్ మీదుగా వస్తుండగా అనుకోకుండా పాదచారులు అడ్డం రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో అతడు బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా అది బోల్తాపడి విద్యార్థులు గాయలపాలయ్యారు. -
బస్సు బోల్తా : ఏడుగురు మృతి
బీజింగ్: బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఈ సంఘటన చైనాలోని యునాన్ ప్రావెన్స్లో సోమవారం చోటు చేసుకుంది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు... గార్డ్రైలును ఢీ కొని బోల్తా పడింది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మరణించారని పోలీసులు చెప్పారు. -
బస్సు బోల్తా : ఆరుగురు ప్రయాణికులు మృతి
చైనాలోని చాంగ్కింగ్ నగరంలో బస్సు బోల్తా పడి ఆరుగురు మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మొత్తం 53 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు టైర్ పేలింది. దాంతో బస్సు బోల్తా పడిందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రమాదం శనివారం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. -
యూఎస్‌లో బస్సు బోల్తా: 50 మందికి గాయాలు
కాలిఫోర్నియాలోని తూర్పు లాస్ ఎంజెల్స్ లోని జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారని ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. గురువారం సంభవించిన ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా తీవ్రంగా గాయాలపాలైన క్షతగాత్రులను మాత్రం అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా సమీపంలోని పెద్ద ఆసుపత్రులకు తరలించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ప్రయాణీకుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సు సన్ బెర్నాడినో నుంచి కాసినో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక మీడియా శుక్రవారం ఓ కథనాన్ని వెలువరించింది.