ఫ్లైఓవర్పై స్కూల్ బస్సు బోల్తా | 12 children injured as school bus overturns | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్పై స్కూల్ బస్సు బోల్తా

Published Tue, Jul 14 2015 12:07 PM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

12 children injured as school bus overturns

న్యూఢిల్లీ: ఢిల్లీలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని పలువురు విద్యార్థులు గాయపడ్డారు. తాము ప్రయాణీస్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడటంతో మొత్తం పన్నెండుమందికి గాయాలపాలయ్యారు. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గాయపడిన విద్యార్థులను సమీపంలోని సుశృతా ట్రామా సెంటర్కు, అరుణా అసఫ్ అలీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం మొత్తం 30 మంది విద్యార్థులతో బయలుదేరిన రుక్మిణీ దేవీ, విక్టోరియా గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్స్కు చెందిన బస్సు ఉదయం 8గంటల ప్రాంతంలో ఐఎస్బీటీ ఫ్లైఓవర్ మీదుగా వస్తుండగా అనుకోకుండా పాదచారులు అడ్డం రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో అతడు బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా అది బోల్తాపడి విద్యార్థులు గాయలపాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement