విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. | Uttar Pradesh Prayagraj Bus With 75 Students Overturns | Sakshi
Sakshi News home page

75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు..

Published Sat, Dec 17 2022 3:39 PM | Last Updated on Sat, Dec 17 2022 3:39 PM

Uttar Pradesh Prayagraj Bus With 75 Students Overturns - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని సైదాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 75 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. జౌన్‌పూర్‌లోని కాంతి దేవి జనతా విద్యాలయ పాఠశాల విద్యార్థులను ప్రయాగ్‌రాజ్‌లోని మాన్‌గఢ్‌కు టూర్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ముందున్న ఓ బైక్‌ను తప్పించబోయి డ్రవైర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కూడా కిందపడి గాయాలపాలయ్యారు.
చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement