యూపీ: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో యుమున ఎక్స్ప్రెస్వేపై గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. యువన ఎక్స్ప్రెస్వేపై వేగంగా వెళుతున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు.