బస్సులో భార్యను అలా చూసి.. | illegal affair: police head constable attacks with knife on wifes lover | Sakshi
Sakshi News home page

బస్సులో భార్యను అలా చూసి..

Published Tue, Apr 19 2016 8:27 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

బస్సులో భార్యను అలా చూసి.. - Sakshi

బస్సులో భార్యను అలా చూసి..

చీరాల: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆమె సహోద్యోగిపై కత్తితో దాడిచేసి, పీకకోశాడో హెడ్ కానిస్టేబుల్. ప్రకాశం జిల్లా చీరాల బస్ స్టాండ్ లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటనలో కానిస్టేబుల్ చెయ్యికూడా తెగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలనుబట్టి..

భార్యాపిల్లలతో కలిసి చీరాలలో నివసిస్తోన్న బాలిగ శ్రీనివాసరావు కారంచేడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య అదే ఊళ్లోని ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. అదే ఆఫీసులో అసిసెంట్ మేనేజర్ సునీల్(35)తో ఆమెకు చనువు ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీనివాసరావుకు తెలియడంతో పలు మార్లు భార్యను హెచ్చరించాడు. మాట వినకపోయేసరికి ఎలాగైనా సునీల్ ను అంతం చేయాలనుకున్నాడు.

మంగళవారం తన భార్య సునీల్ తో కలిసి బస్సులో ఉండటాన్ని శ్రీనివాసరావు గమనించాడు. ఒక్కసారిగా బస్సులోకి వెళ్లి వెంటతెచ్చుకున్న కత్తితో సునీల్ పై దాడిచేసి పీకకోశాడు. ఈ పెనుగులాటలో హెడ్ కానిస్టేబుల్ చెయ్యి కూడా తెగిపోయింది. ఈ సంఘటనతో బస్టాండ్ ప్రాంతమంతా నివ్వెరపోయింది. రక్తపుమడుగులో పడిఉన్న సునీల్ ను, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును  కొందరు ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement