చీరాల (ప్రకాశం) : పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలోని బెంజిపాలెంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పవన్‌కుమార్(18) అవనిగడ్డలోని కళాశాలలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో కళాశాలకు క్రిస్మస్ సెలవులు కావడంతో.. చీరాలలోని సొంతింటికి వెళ్లాడు. కాగా శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం.
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
Published Sat, Dec 26 2015 4:15 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM