
జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న సినీనటి గౌతమ్ రేష్మీ
చీరాల: స్థానిక ముంతావారి సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మై స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి, ప్రముఖ యాంకర్ గౌతమ్ రేష్మీ హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె ప్రేక్షకులకు అభివాదం చేశారు. రేష్మీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.రమేష్‌బాబు, స్టోర్స్ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.
రేష్మీని చూసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులు