![Chirala MLA Amanchi Krishna Mohan Quits TDP - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/13/Amanchi-Krishna-Mohan.jpg.webp?itok=v-lMS6IY)
సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. చీరాల నియోజకవర్గంలో కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, ప్రభుత్వం, పార్టీకి సంబంధం లేని శక్తులు అక్కడ పని చేస్తున్నాయని, అందుకే తాను టీడీపీకి రాజీనామ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి తన లేఖలో పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా ఆయన టీడీపీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు కూడా. 2014లో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment