ముక్కుపచ్చలారని చిన్నారిని మట్టిలో కలపాలనుకున్న ఒక తల్లి నుంచి స్థానికులు రక్షించి పునర్జన్మ ప్రసాదించిన సంఘటన గురువారం రాత్రి ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది.
పసికందును పూడుస్తున్న తల్లిని అడ్డుకున్న స్థానికులు
చీరాల, న్యూస్‌లైన్: ముక్కుపచ్చలారని చిన్నారిని మట్టిలో కలపాలనుకున్న ఒక తల్లి నుంచి స్థానికులు రక్షించి పునర్జన్మ ప్రసాదించిన సంఘటన గురువారం రాత్రి ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. యాచకురాలైన మహిళ తన 2 నెలల మగ శిశువును స్థానిక వైకుంఠపురం సమీపంలో ఉన్న గూడ్స్ షెడ్డు వద్ద చిత్రహింసలకు గురిచేయడంతో పాటు బతి కుండగానే మట్టిలో కలిపేందుకు ప్రయత్నించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు తల్లి నుంచి శిశువును రక్షించి తమ సంరక్షణలో ఉంచుకున్నారు. ఆ తల్లి పరారైంది. స్థానికులు చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శిశు సంక్షేమ శాఖ జిల్లా డీసీపీవో జ్యోతిసుప్రియ ఆ శిశువును సంరక్షణలోకి తీసుకున్నారు.