ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది చంద్రబాబు పాలనా, తాలిబాన్ల పాలనా అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ కూడా తీగలకు వేలాడదీస్తే రైతుల బాధలు తెలుస్తాయని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఏపీలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సీఎం, మంత్రులు స్పందించరా అని నిలదీశారు.