journalist attacked
-
యూపీ మాజీ సీఎంపై కేసు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జర్నలిస్టులపై దాడి చేశారనే ఆరోపణలతో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, 20 మంది సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను నెట్టివేయడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలవారు వేరువేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని యూపీ శాంతి భద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వారి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు షలాబ్‌మణి త్రిపాఠి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్నారని సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు వీధిరౌడీల మాదిరిగా జర్నలిస్టులపై దారుణంగా దాడి చేశారని ఆరోపించారు. అదే విధంగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. భారతదేశ ప్రజాస్వామ్యానికి భావప్రకటనా స్వేచ్ఛ ప్రధానమైందని గుర్తుచేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి:ట్రాక్టర్ ర్యాలీకి డీజిల్ నిషేధం బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్) -
రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారు
సాక్షి, అమరావతి/తెనాలి రూరల్: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాజధానిలో తనపై దాడి అనంతరం కొందరు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ టీవీ జర్నలిస్ట్ నల్లమోతు దీప్తి డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం దీప్తి, మరో మహిళా జర్నలిస్టు హసీనా, పలువురు మీడియా ప్రతినిధులు డీజీపీ సవాంగ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచి్చందన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. కానీ ఆ నిరసనలు హింసకు దారితీసేలా ఉండకూడదని అన్నారు. రాజధాని రైతుల ఆందోళనను సున్నితంగానే చూశామన్నారు. అయితే ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కల్గించేలా వ్యవహరించడం, శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇప్పటి వరకు రాజధానిలో ఆందోళనలపై 12 కేసులు నమోదు చేశామన్నారు. జర్నలిస్టులపై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు, రక్షణ అంశాలకు సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి రాజధాని హైపవర్ కమిటీలో తన పేరు పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. డీజీపీ ఆఫీసు ఎక్కడ ఉండాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు అందించే సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బలగాలను సమన్వయం చేయడానికి డీజీపీ కార్యాలయం దోహదం చేస్తుందన్నారు. పాలనాపరమైన పోలీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నిందితులకు జనవరి 10 వరకు రిమాండ్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో జర్నలిస్టులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం, మల్కాపురం, వెలగపూడి, నెక్కల్లు గ్రామాలకు చెందిన శివబాబు, నరేష్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, లోకనాయక్, వెంకటస్వామిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీరిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే నిందితులను విడిచిపెట్టాలని టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద హడావుడి చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్టేషన్‌కు వచ్చి నిందితులను విడిచిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం రాత్రి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్వీవీఎన్ లక్షి్మ.. నిందితులకు జనవరి 10 వరకూ రిమాండ్ విధించారు. -
ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. పత్రికా స్వేచ్ఛలో 180 దేశాలకుగాను గతేడాది భారత్‌కు 136వ స్థానం రాగా, ఈ ఏడాది 138వ స్థానం వచ్చింది. పత్రికా స్వేచ్ఛా సూచికను ‘రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్’ రూపొందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. 1992 రెండు నుంచి ఇప్పటి వరకు 64 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యలకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక రిపోర్టర్లే ఉన్నారు. స్థానికంగా అధికారంలో ఉన్న వ్యక్తి ఆగడాలకే వీరులో ఎక్కువ మంది బలయ్యారు. 2017 నుంచి హిందూత్వ శక్తుల దాడులకు జర్నలిస్టులు బలవుతున్నారు. కర్ణాటకలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య అలాంటిదే. ర్యాడికల్ హిందూత్వ శక్తులే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఆరెస్సెస్‌ను అంత ఘాటుగా విమర్శించి ఉండకపోతే ఆమె ఈ రోజున బతికి ఉండేదంటూ ఓ బీజేపీ శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం. 2017లో ఐదుగురు జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో 35 ఏళ్ల జర్నలిస్ట్ సందీప్ శర్మను డంపర్ యాక్సిడెంట్లో చంపేశారు. ఇసుక మాఫియాతో కుమ్ముక్కయిన పోలీసు అధికారి గురించి వార్త రాసినందుకు ఆయన బలయ్యారు. హత్య జరిగిన మరుసటి రోజే కేసును సిబీఐకి అప్పగిస్తున్నామని మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించినప్పటికీ ఇంతవరకు సీబీఐ అధికారులు కేసును టేకప్ చేయలేదు. ఇదే విషయమై వారిని అడిగితే తమకు ఎవరూ కేసును అప్పగించలేదని వారు తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించేవరకు ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును దర్యాప్తు చేస్తుందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 15 మంది జర్నలిస్టులు హత్యలు గురికాగా, ఏ ఒక్క కేసులో ఎవరికి శిక్ష పడలేదు. గడచిన దశాబ్దం కాలంలోనే ఏ ఒక్క జర్నలిస్ట్ హత్య కేసులో న్యాయం జరగలేదని అధికారిక వివరాలే తెలియజేస్తున్నాయి. -
చంద్రబాబు, మంత్రులు స్పందించరా?
-
జర్నలిస్టుపై టీడీపీ నేత దౌర్జన్యం!
విశాఖపట్నం: విశాఖలో పచ్చ తమ్ముళ్లు దాష్టీకానికి పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో ఓ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగాడు. స్థానిక చెరువులో మట్టి తవ్వి అక్రమంగా ఇసుక రవాణా వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సాక్షి టీవీ ప్రతినిధి చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను చిత్రీకరించేందుకు యత్నించాడు. ఆగ్రహించిన టీడీపీ నేత అప్పలనాయుడు తన భాగోతాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై దాడికి దిగి అతడ్ని గాయపరిచారు. తనపై టీడీపీ నేత అప్పలనాయుడు దాడికి పాల్పడ్డాడంటూ బాధిత విలేకరి గొలుగొండ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జైలుకు ఇంటర్వ్యూకు వెళితే దాడి చేశారు
చండీగఢ్: పంజాబ్ లో సీనియర్ జర్నలిస్టుపై దాడి జరిగింది. జైలులో ఓ ఇంటర్యూకోసం వెళ్లిన ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ అసలు జైలులో ఇంటర్వ్యూకు ఎలా అనుమతిచ్చారంటూ ఓ జైలు అధికారిని సస్పెండ్ చేసింది. కన్వార్ సంధు అనే వ్యక్తి పంజాబ్ లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ హత్య కేసులో ప్రధాన నేరస్తుడు బల్వంత్ సింగ్ రాజోనాను ఇంటర్వ్యూ చేసేందుకు పాటియాలా జైలుకు వెళ్లాడు. ఆ సమయంలోనే కొందరు వ్యక్తులు కన్వార్ పై దాడికి దిగారు. -
జర్నలిస్టును చితకబాదిన భద్రతా దళాలు
దొంగ అనుకుని ఓ ఇంగ్లీషు పత్రికలో పనిచేసే పాత్రికేయుడిని భద్రతా దళాల సిబ్బంది చితక్కొట్టారు. ఈ సంఘటన మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కాంగ్లా పశ్చిమ గేటు వద్ద జరిగింది. 'ఇంఫాల్ ఫ్రీ ప్రెస్' పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అరిబమ్ ధనంజయ్ అలియాస్ చావోబాను ఇండియా రిజర్వ్ బెటాలియన్ సిబ్బంది కొట్టారు. అతడు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. తాను పాత్రికేయుడినని అతడు భద్రతా దళాల సిబ్బందికి చెప్పినా, రాత్రిపూట దొంగలా తిరుగుతున్నాడంటూ అతడిని కొట్టారు. తర్వాత జేఎన్ ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స చేయించి పంపేశారు. అయితే జరిగిన సంఘటనపై స్పందించేందుకు ఐఆర్బీపీ సిబ్బంది అందుబాటులో లేరు. అనంతరం చావోబా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చావోబాపై దాడిని ఆల్ మణిపూర్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఖండించింది. భద్రతా దళాల సిబ్బంది తాగేసి తరచు పాత్రికేయులపై దాడులు చేస్తున్నారని, వాటిని నివారించాలని కోరింది.