
చీరాలలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా పవర్ కట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడుతున్నారు.
చీరాల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఆదివారం రాత్రి జరుగుతున్న వైఎస్ఆర్ జనభేరి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా ప్రత్యర్థులు పవర్ కట్ చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో వైఎస్ జగన్ సంయమనంతో ఉండాలంటూ కార్యకర్తలను కోరారు. ఓటుతో బుద్ది చెప్పాలంటూ పిలుపునిచ్చారు. పవర్ కోసం వైఎస్ జగన్తో పాటు నాయకులు, కార్యకర్తలు నిరీక్షించారు. ఆ తర్వాత విద్యుత్ను పునరుద్దరించడంతో సభ కొనసాగింది. జగన్ ప్రసంగం కోసం జనం ఓపిగ్గా ఎదురు చూశారు.