చీరాల నాటుసారా విక్రయ కేంద్రాలకు అడ్డాగా మారింది.
చీరాల: చీరాల నాటుసారా విక్రయ కేంద్రాలకు అడ్డాగా మారింది. ఉజిలిపేట, దండుబాట, ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద, జవహర్‌నగ ర్, జాలమ్మగుడి, జాన్‌పేట, రామ్‌నగర్, ఆదినారాయణపురం వంటి ప్రాంతాల్లో వీధివీధినా సారా దుకాణాలే. తరచూ ఎక్సైజ్ దాడులు కొనసా.. గుతూనే ఉంటాయి. కానీ ఒక్క దుకాణం కూడా మూతపడదు. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా పూర్తి స్థాయిలో దాడులు చే యాలంటే ఎక్సైజ్ పోలీసులకు ఒకింత భయమని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక మంది అధికారులు దాడులకు గురయ్యారు. చాలామంది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు బలయ్యారు.
దింతో ఎక్సైజ్ పోలీసులు మొక్కుబడి దాడులకు పరిమితవుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం పదిమందికిపైగా ఎక్సైజ్, సివిల్ పోలీసులు.. అందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ వి.చంద్రశేఖరరెడ్డి, టూటౌన్ సీఐ పరంధామయ్య, ఇతర అధికారులు, సిబ్బంది మూకమ్మడిగా సారా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 50 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఉజిలీపేటలో చాలాకాలంగా నాటుసారా విక్రయిస్తున్న అంగడి సురేష్ అలియాస్ కుక్కల సురేష్ నివాసంలో విక్రయానికి ఉంచిన సారాను స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు కేసుల్లో ఉన్న సురే ష్ తన ఇంటికే ఎందుకొచ్చారంటూ పోలీసులతో ఘర్షణకు దిగాడు.
ఇంట్లోకి వెళ్లి సోదాలు చేస్తున్న ఏఈఎస్ చంద్రశేఖరరెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. సురేష్‌కు మద్దతుగా తన కుంటుంబ సభ్యులు వచ్చారు. దింతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతవరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఏఈఎస్‌కు చేతికి గాయాలయ్యాయి. పోలీసులపైనే తిరగబడ్డ సురేష్‌ను చాలాసేపటి తర్వాత అరెస్టు చేసి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రుడు ఏఈఎస్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. ఆయన ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులపైనే దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకోవడంతో ఎక్సైజ్ పోలీసులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.