ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేత ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీలైతే లొంగతీసుకోవడం, కుదరకపోతే బెదిరించడం, అదీ సాధ్యం కాకపోతే చంపడం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం తమకు ఎదురు తిరిగిందని గవినివారి పాలెంకు చెందిన దేవర సబ్బులు అనే మహిళపై ఆమంచి వర్గీయులు దాడికి పాల్పడ్దారు. ఈదాడిలో సుబ్బులు తీవ్ర గాయాలపాలైంది. దీంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.