వేటపాలెంలో యువతి దారుణ హత్య | Lover Brutally Kills His Girlfriend in Chirala | Sakshi
Sakshi News home page

వేటపాలెంలో యువతి దారుణ హత్య

Published Sun, Sep 17 2017 8:53 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

వేటపాలెంలో యువతి దారుణ హత్య - Sakshi

వేటపాలెంలో యువతి దారుణ హత్య

- గొంతు కోసి పరారైన ఆటో డ్రైవర్‌

సాక్షి, వేటపాలెం (చీరాల): ఆటోడ్రైవర్‌ ఓ యువతిని గొంతుకోసి హతమార్చిన ఘటన శనివారం రాత్రి ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన యువతి శవనం తేజ(22)ఎంటెక్‌ పూర్తి చేసి చీరాల పట్టణంలోని టీవీఎస్‌ షోరూంలో పనిచేస్తోంది. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ రామానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ గోపీచంద్‌ ఆ యువతితో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

ఈ క్రమంలో గోపీచంద్‌ శనివారం రాత్రి 7 గంటల సమయంలో తేజను రామానగర్‌లోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనక తలుపు పగలగొట్టి ఇద్దరూలోనికి వెళ్లారు. ఆ తరువాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గోపీచంద్‌ తేజ గొంతుకోసి పరారయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పాడు. గోపీచంద్‌ స్నేహితులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ ప్రేమ్‌కాజల్, రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి యువతి మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement