రేపు టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్ | amanchi krishna mohan joins tdp | Sakshi
Sakshi News home page

రేపు టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్

Published Tue, Sep 1 2015 5:38 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

రేపు టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్ - Sakshi

రేపు టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్


హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధమైంది. ఆయన  బుధవారం టీడీపీలో చేరనున్నారు. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ చేరికపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ప్రధానంగా ఆమంచి చేరికను.. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతుల సునీత వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో  మంత్రులు శిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, పోతుల సునీతలు మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా పోతుల సునీతను చంద్రబాబు బుజ్జగించే పనిలో పడినట్లు సమాచారం.

గత ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన విషయం తెలిసిందే.  అయితే రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఆమంచి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. కాగా, 2014 ఎన్నికల్లో ఆమంచి త్రిముఖ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆమంచి.. అనంతరం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పోతుల సునీతతో పాటు మరో కీలక ఎంపీ సహా కొందరు మంత్రులు ..ఆమంచి చేరికను అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement