ఆమంచి నుంచి ప్రాణహాని | Reporter Nagarjuna Reddy comments on Amanchi Krishna Mohan | Sakshi
Sakshi News home page

ఆమంచి నుంచి ప్రాణహాని

Published Wed, Feb 8 2017 1:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

Reporter Nagarjuna Reddy comments on Amanchi Krishna Mohan

విలేకరి నాగార్జునరెడ్డి

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ‘చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ నన్ను చంపేందుకు కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలోనే చీరాల పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా నాపై దాడి జరిగింది. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది’ అంటూ విలేకరి నాయుడు నాగార్జునరెడ్డి మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. 

  ‘మీ నియోజకవర్గం లో ఒక రౌడీ ఉన్నాడని’ ఆమంచి కృష్ణమోహన్‌ను ఉద్దేశించి స్వయంగా చంద్రబాబే గత ఎన్నికల సమయంలో చెప్పారని ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి గుర్తుచేశారు.ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు కృష్ణాంజనేయులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement