ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ లేదు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...ఆయన వారసుడు జగన్. అందుకే వచ్చాను. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ సీపీలో చేరతా.