ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నాయకులతో ఆమంచి సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
గత ఎన్నికల్లో ఆమంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఆమంచి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలసి బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.