చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త‍్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమంచి తన కుటుంబ సభ్యులతో సహా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ... త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు.