ఆమంచి కోసం సోదరి విస్తృత ప్రచారం | Ammachi's Sister Padmavati Election Campaign For Her Brother | Sakshi
Sakshi News home page

ఆమంచి కోసం సోదరి విస్తృత ప్రచారం

Published Thu, Mar 28 2019 10:39 AM | Last Updated on Thu, Mar 28 2019 10:40 AM

Ammachi's Sister Padmavati Election Campaign For Her Brother - Sakshi

దేవాంగపురిలో ఓట్లు అభ్యర్థిస్తున్న కంకట పద్మావతి, రామన్నపేటలో ప్రచారం నిర్వహిస్తున్న ఆమంచి సుజాత 

సాక్షి, చీరాలటౌన్‌: ‘మీ ఇంటి ఆడపడుచులాగా అందరికి అందుబాటులో ఉంటా.. నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..సమస్యలను పరిష్కరిస్తాం..ఆదరించండి’ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ గెలుపుకోసం ఆమంచి సోదరి కంకట పద్మావతి విస్త్రృతంగా ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్‌ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో మంచిని గెలిపించాలని కోరుతూ బుధవారం మండలంలోని దేవాంగపురి గ్రామంలోని పలు కాలనీల్లో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ప్రతి గృహాన్ని సందర్శించి పార్టీ బలపరిచిన అభ్యర్థి, తనసోదుడు కృష్ణమోహన్‌ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.  ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో ఓటర్లంతా ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌ సీపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 


ఆమంచిని గెలిపించండి
వేటపాలెం: చీరాల శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఓటు వేయాలంటూ కుటుంబ సభ్యులు బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని రామన్నపేట పంచాయతీలో కొత్తిళ్ళు, రామన్నపేటల్లో ఆమంచి కృష్ణమోహన్‌ సతీమణి సుజాత, వేటపాలెం గ్రామంలో గొల్లపూడివారి వీధి, ఆణుమల్లిపేట తదితర ప్రాంతాల్లో కృష్ణమోహన్‌ వదిన రాజ్యలక్ష్మి, దేవాంగపురి ప్రాంతంలో సోదరి పద్మ  కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి, మాజీ ఎంపీటీసీ పిచ్చుక సునీత, బాపట్ల పార్లమెంట్‌ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బీరక సురేష్, నేతలు గుమ్మడి సుశీల, బి. కోటేశ్వరరావు, కొలుకుల వెంకటేష్, బండ్ల బాబు, మండల సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ టి. సమృద్ధి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement